'ఉప్పెన' వ‌చ్చేస్తోంది.. ఎప్పుడంటే..?

Uppena Movie Release Date Announced. మెగా మేన‌ల్లుడు, హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా 'ఉప్పెన' ఫిబ్రవరి 12న వ‌చ్చేస్తోంది.

By Medi Samrat  Published on  27 Jan 2021 4:39 AM GMT
Uppena Movie Release Date Announced.

మెగా మేన‌ల్లుడు, హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఉప్పెన'. ఈ చిద్రానికి క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిశ్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నారు.

ఇన్ని విశిష్ట‌త‌లు ఉన్న ఈ సినిమా క‌రోనా కార‌ణంగా విడుదల‌కు నోచుకోలేదు. వ్యాక్సిన్ రావ‌డంతో అడ్డంకుల‌న్ని తొల‌గించుకుని విడుద‌ల‌కు సిద్ద‌మైంది. తాజాగా చిత్ర‌యూనిట్ విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఫిబ్రవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ 'ఓ యువజంట ప్రేమాయణానికి సామాజిక అంతరాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. సముద్రం సాక్షిగా మొదలైన ఆ ప్రేమ కథ ఏ తీరాలకు చేరుకుందనేది ఆసక్తిని పంచుతుంది. ఇటీవల విడుదలైన టీజర్‌తో పాటు దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచిన పాటలకు చక్కటి ఆదరణ లభిస్తోంది. వినూత్న ప్రేమకథగా మెప్పిస్తుందని తెలిపారు.


Next Story
Share it