సల్మాన్ కు సెక్యూరిటీ పెంచేశారుగా..!
Upgraded security for Salman Khan. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచింది ప్రభుత్వం.
By Medi Samrat Published on 1 Nov 2022 1:55 PM GMTబాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కు భద్రతను పెంచింది ప్రభుత్వం. గతంలో సల్మాన్ ఖాన్ కు ఎక్స్ సెక్యూరిటీ ఉండగా.. ఇప్పుడు వై ప్లస్‌కు పెంచారు. భద్రత పెంపుతో సల్మాన్ వెంట నిత్యం ఇద్దరు సాయుధ గార్డులు.. ఇంటి వద్ద రోజంతా ఇద్దరు గార్డులు పహారా కాస్తారు. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు రావడంతో ముంబై పోలీసులకు చెందిన ప్రొటెక్షన్ బ్రాంచ్ సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచాలని నిర్ణయించింది. సల్మాన్ భద్రత విధుల్లో ఇప్పటి వరకూ ఒక సాయుధ గార్డు పనిచేస్తున్నారు. లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ ఉన్నారనే సమాచారంతో బాలీవుడ్ కండలవీరుడికి భద్రతను పెంచారు. సల్మాన్‌ను హత్య చేసేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు ఆయన ఫామ్ హౌస్ వద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు ఇటీవలే సల్మాన్ ఖాన్ కు పర్సనల్ వెపన్ లైసెన్స్ జారీ చేశారు.
సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ ఇటీవల మార్నింగ్ వాక్ చేసిన తర్వాత బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌లోని బెంచ్‌పై కూర్చొని ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేఖను ఉంచిన సంగతి తెలిసిందే..! సలీం ఖాన్ పోలీసులను సంప్రదించాడు. బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 506-II (నేరపూరిత బెదిరింపు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. అనంతరం సలీం ఖాన్, సల్మాన్ ఖాన్ వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేసుకున్నారు. లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ నుండి ప్రాణహాని ఉందని ఆరోపణలు వచ్చిన తరువాత పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు.