అర్మన్‌ ఇబ్రహీంతో ఉపాసన సోదరి పెళ్లి..!

Upasana’s Sister To Marry Athlete. ఉపాసన.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ భార్యగా, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి

By Medi Samrat  Published on  18 July 2021 2:48 PM IST
అర్మన్‌ ఇబ్రహీంతో ఉపాసన సోదరి పెళ్లి..!

ఉపాసన.. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ భార్యగా, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ఎడ్యుకేట్ చేసే గొప్ప మహిళగా అందరికీ తెలిసిన మనిషి. ఇక ఉపాసన కుటుంబంలో ఓ శుభకార్యం జరగబోతోంది. ఉపాస‌న సోదరి అనుష్పాల కామినేని త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారనే విషయాన్ని తెలియ‌జేసింది. అనుష్పాల కొద్ది రోజులుగా అథ్లెట్ అర్మాన్ ఇబ్రహీంతో ప్రేమ‌లో ఉండ‌గా, ఇటీవ‌ల వారి నిశ్చితార్థం పూర్తైంది.

అథ్లెట్‌ అర్మన్‌ ఇబ్రహీంతో కొన్నాళ్లుగా ప్రేమలో ఉంది ఉపాస‌న సోదరి అనుష్పాల. ఆమె అతడిని త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. తాజాగా వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అనుష్పాల. ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ 'నా డార్లింగ్స్‌కు అభినందనలు' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉపాసన సోదరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.



మాజీ ఇండియన్‌ ఎఫ్‌ 3 ఛాంపియన్‌ అక్బర్‌ ఇబ్రహీం తనయుడే అర్మన్‌ ఇబ్రహీం. ఇతడు కార్‌ రేసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అనుష్పాల అపోలో గ్రూప్‌ చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, దోమకొండ కోటకు చెందిన ఉమాపతి రావుల మనవరాలు, శోభన- అనిల్‌ కామినేనిల కుమార్తె అనుష్పాల.


Next Story