'అన్‌స్టాపబుల్' ప్రోమోతో బాలకృష్ణ ఎంట్రీ కేక.!
Unstoppable with nbk show promo in Aha. నట సింహాం నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆహాలో సెలబ్రిటీ షోకు హోస్ట్‌గా
By అంజి Published on
27 Oct 2021 1:44 PM GMT

నట సింహాం నందమూరి బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆహాలో సెలబ్రిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్ విడుదల చేశారు. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికే అంటూ ప్రోమోను రిలీజ్ చేశారు. నీకు చిత్తశుద్ది ఉన్నపుడు, నీకు లక్ష్యశుద్ది ఉన్నపుడు, నీకు సంకల్పశుద్ది ఉన్నపుడు నిన్ను పంచభూతాలు కూడా ఆపలేవు. మాటల్లో ఫిల్టర్ ఉండదు. సరదాలా స్టాప్ ఉండదు. సై అంటే సై నై అంటే నై..వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అంట ప్రోమోలో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ గుస్‌బంప్స్ తెప్పిస్తోంది. నవంబర్ 4వ తేదీ నుండి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమో బాలకృష్ణ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈ షోలో ఫస్ట్ గెస్ట్ ఎవరు అన్న దానిపై ప్రకటన రావాల్సి ఉంది.
Next Story