బాలయ్య 'అన్ స్టాపబుల్ 2'.. ఈ సారి మరింత 'రంజుగా'.. !

Unstoppable with NBK season 2 trailer. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సీజన్ 2

By Sumanth Varma k  Published on  10 Oct 2022 2:15 PM GMT
బాలయ్య అన్ స్టాపబుల్ 2.. ఈ సారి మరింత రంజుగా.. !

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఆల్ రెడీ ముగిసింది. ఫస్ట్ గెస్ట్ గా చంద్రబాబు వచ్చారు. సెట్స్ లో చంద్రబాబు - బాలయ్య బాబు మధ్య ఆసక్తి కరమైన చర్చ జరిగింది. అందుకే.. ఆ సమయంలో ప్రత్యక్ష ఆడియన్స్ కూడా తెగ ఎగ్జైట్ అయ్యారు. వాటికి సంబంధించిన విజువల్స్ చూస్తేనే తెలుస్తోంది. ఈ సెకండ్ సీజన్ షో ఏ రేంజ్ హిట్ అవుతుంది అనేది.


ఇక 'అన్‌స్టాప‌బుల్ 2' ఈ నెల‌ 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రొమోను ఆహా నేడు విడుద‌ల చేసింది. ''ప్రశ్నల్లో మరింత ఫైర్! ఆటల్లో మరింత డేర్!! సరదాల్లో మరింత సెటైర్!!!మీకోసం.. మరింత రంజుగా.. 'అన్‌స్టాప‌బుల్‌ 2' స్ట్రీమింగ్ కానుంది. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!'' అని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా.

మొత్తానికి మ‌రోసారి బాల‌య్య‌తో `ఆహా` అనిపించే కంటెంట్ తో `అన్‌స్టాప‌బుల్‌`ని ముస్తాబు చేశాం అంటున్నారు మేకర్స్. ఇప్పటికే సీజన్ 2 ఫస్ట్ గెస్ట్ చంద్రబాబు అని తెలిసిందే. అయితే, సీజ‌న్ 1 లో సోలోగా ఒక్క హీరోయిన్ తో కూడా బాల‌య్య ప్రత్యేకంగా ఇంక్ట్రాక్ట్ కాలేదు. అందుకే, సీజ‌న్ 2లో ఆ లోటును తీర్చ‌డానికి ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా వినిపిస్తున్న పేరు 'నయనతార'. అన్ స్టాప‌బుల్ కి నయనతారను తీసుకురావ‌డానికి ఆహా మేనేజ్‌మెంట్ తీవ్రంగా ప్ర‌యత్నిస్తోంది.

ఈ మేర‌కు… నయనతార తో సంప్ర‌దింపులు కూడా మొద‌లెట్టిందట. నయనతార మీడియాకు, సినిమా వేడుల‌కు దూరంగా ఉంటోంది. మ‌రి అన్ స్టాప‌బుల్ లో క‌నిపించ‌డానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Next Story
Share it