చిరంజీవి-బాలయ్య ఎపిసోడ్ ఉండేనా..?

Unstoppable Season 2 Coming Soon. నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్ స్టాప‌బుల్ షో' కు ఊహించని సక్సెస్

By Medi Samrat  Published on  20 Jun 2022 7:32 PM IST
చిరంజీవి-బాలయ్య ఎపిసోడ్ ఉండేనా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన 'అన్ స్టాప‌బుల్ షో' కు ఊహించని సక్సెస్ వచ్చిన సంగతి తెలిసిందే..! హోస్ట్ గా బాలకృష్ణ అద్భుతంగా చేశారు. మోహన్ బాబు, మహేష్, రవితేజ వంటి స్టార్స్ తో బాలయ్య ఎపిసోడ్స్ అద్భుతంగా సాగాయి. అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. తాజాగా ఆహా టీం అధికారికంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ను ప్రకటించింది. తెలుగు ఇండియన్ ఐడల్ షోలో బాలయ్య కూడా 'మధుర క్షణాలకి ముగింపు ఉండదు, కొనసాగింపే' అంటూ చెప్పారు. ఆ వీడియో బైట్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కమింగ్ సూన్ అని పోస్ట్ చేసింది ఆహా టీం.


అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో అంటూ మేకర్స్ ప్రకటించేశారు. వి ఆర్ బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అన్ స్టాపబుల్ 2 షూటింగ్ కి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. దీంతో బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చిరంజీవి-బాలయ్య బాబు ఎపిసోడ్ ఎప్పుడు వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు.










Next Story