ప్రభాస్‌ను కలవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

Union Home Minister Amit Shah to meet Pan India star Prabhas. శనివారం (సెప్టెంబర్ 17) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. ఏడాది పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో

By అంజి  Published on  14 Sept 2022 5:49 PM IST
ప్రభాస్‌ను కలవనున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

శనివారం (సెప్టెంబర్ 17) తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. ఏడాది పాటు జరిగే వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ వస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ రానున్న అమిత్ షా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ తెలుగు నటుడు, కేంద్ర మాజీ మంత్రి ఉప్పల పాటి కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చనున్నారు. ఆ తర్వాత అమిత్ షా.. పాన్-ఇండియా నటుడు ప్రభాస్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఇటీవల టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో అమిత్ షాను కలిశారు. ఎన్టీఆర్‌ బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు అప్పట్లో జోరందుకున్నాయి. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. జాతీయ జెండాను ఎగురవేసి కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

Next Story