సలార్ సైడ్ అయ్యాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిన్న సినిమాలు

ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం.. 'సలార్' వాయిదా వేయడంతో ఆ రోజున పలు తెలుగు సినిమాలు

By Medi Samrat  Published on  4 Sept 2023 8:14 PM IST
సలార్ సైడ్ అయ్యాడు.. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చిన్న సినిమాలు

ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రం.. 'సలార్' వాయిదా వేయడంతో ఆ రోజున పలు తెలుగు సినిమాలు విడుదల అవ్వబోతున్నాయి. పలు చిన్న తెలుగు చిత్రాలు ఆరోజు విడుదల కాబోతున్నట్లు అఫీషియల్ ప్రకటనలో చెబుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో కెజిఎఫ్ సిరీస్ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందించిన సలార్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం తదితర కారణాలతో సినిమా వాయిదా పడింది.

ఇప్పుడు రెండు చిన్న తెలుగు సినిమాలు సలార్ విడుదల తేదీ రోజున వచ్చేందుకు సిద్ధమయ్యాయి. ఆ చిత్రాలలో కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'రూల్స్ రంజన్' కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ 'MAD' కూడా ఒకటి. రథినం కృష్ణ రచన, దర్శకత్వం వహించిన 'రూల్స్ రంజన్' సినిమా కిరణ్ అబ్బవరం నుండి ఈ ఏడాది వస్తున్న మూడో సినిమా. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలు ఈ ఏడాది విడుదల అయ్యాయి. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. అమ్రిష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటల్లో ఒకటైన 'సమ్మోహనుడా' సూపర్ హిట్ గా నిలిచింది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నేహా శెట్టి అందం ప్లస్ గా మారింది. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన రూల్స్ రంజన్‌లో వెన్నెల కిషోర్, హైపర్ ఆది, నెల్లూరు సుదర్శన్, సుబ్బరాజు, అజయ్ తదితరులు నటించారు. 'మ్యాడ్' సినిమా చిన్న సినిమాగా వస్తున్నా.. ఇటీవల విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. యూత్ ను ఆకట్టుకోగలిగే సత్తా ఈ సినిమాలో ఉంది.

Next Story