తన తల్లి దెయ్యంతో మాట్లాడిందంటున్న హీరోయిన్

Twinkle Khanna recalls Dimple Kapadia said she talked to a ghost at Jaipur palace. బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి ట్వింకిల్ ఖన్నా ఇటీవల

By Medi Samrat  Published on  3 Jun 2022 2:45 PM GMT
తన తల్లి దెయ్యంతో మాట్లాడిందంటున్న హీరోయిన్

బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి ట్వింకిల్ ఖన్నా ఇటీవల ఆమె తన యూట్యూబ్ చానల్ కోసం జైపూర్ రాజవంశీకురాలు రాజమాత పద్మినీ దేవితో ముచ్చటించారు. ట్వింకిల్ తన తల్లి డింపుల్ కపాడియా గతంలో ఓసారి జైపూర్ రాయల్ ప్యాలెస్ ను సందర్శించిందని, అప్పుడు ఆమెకు ఆ రాజ భవనంలో దెయ్యం కనిపించిందని తెలిపారు. తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడిందని కూడా వెల్లడించారు. 1990లో 'లేకిన్' అనే హిందీ చిత్రం షూటింగ్ కోసం డింపుల్ కపాడియా అక్కడికి వెళ్లిందని, ఓ రాత్రంతా జైపూర్ ప్యాలెస్ లోనే గడిపిందని ట్వింకిల్ వివరించారు. తన తల్లి పడుకుని ఉండగా, ఆమె పడక పక్కనే ఓ మహిళ నిల్చుని కనిపించిందని, అది దెయ్యం అని తన తల్లి గుర్తించినట్టు తెలిపారు. చాలాసేపు మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు.

రాజమాత పద్మినీ దేవి దీనిపై స్పందిస్తూ... ఆ సమయంలో డింపుల్ నటిస్తోంది ఓ దెయ్యం సినిమాలో అని, ఆ ప్రభావం ఆమెపై పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మానసిక భ్రాంతుల కారణంగానే డింపుల్ దెయ్యంతో మాట్లాడిన అనుభూతికి లోనై ఉంటుందని వివరించారు. అప్పట్లో ఇదే విషయాన్ని తాను డింపుల్ తోనూ చెప్పానని, జైపూర్ ప్యాలెస్ లో దెయ్యాలేవీ లేవన్న విషయాన్ని ఆమెకు స్పష్టం చేశానని తెలిపారు. రోజంతా దెయ్యంలా నటించి, దెయ్యం ఆలోచనలతోనే పడుకున్నావు కాబట్టి, నీకు దెయ్యం కనిపించినట్టు భ్రమపడుతున్నావని డింపుల్ కు వివరించినట్టు పద్మినీ దేవి వెల్లడించారు. ప్యాలెస్‌లో తనతో సహా ఎవరూ దెయ్యాలను చూడలేదని పద్మిని సమాధానం ఇచ్చారు. డింపుల్ దెయ్యాన్ని చూడడానికి అసలు కారణం లేకిన్ సినిమాలో దెయ్యంగా నటించడమేనని తాను నమ్ముతున్నానని చెప్పారు. గుల్జార్ రూపొందించిన డ్రామా మిస్టరీ చిత్రం లేకిన్‌లో వినోద్ ఖన్నా, అమ్జాద్ ఖాన్, అలోక్ నాథ్ కూడా నటించారు. ఇందులో డింపుల్ దెయ్యం 'రీవా' గా కనిపించింది. తన నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ట్రోఫీని కూడా గెలుచుకుంది డింపుల్ కపాడియా.










Next Story