ట‌క్ జ‌గ‌దీష్ సంక్రాంతి కానుక‌.. పెళ్లి కొడుకుగా నాని

Tuck Jagadish To Release On April 16.నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్'. సంక్రాంతి కానుక‌.. పెళ్లి కొడుకుగా నాని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jan 2021 6:51 AM GMT
Tuck Jagadish

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రం 'ట‌క్ జ‌గ‌దీష్'. శివ నిర్వాణ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ని క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల చేయ‌గా.. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇందులో చాలా డీసెంట్‌గా టక్ వేసుకొని అన్నం ముందు కూర్చున్న నాని వెనుక నుండి క‌త్తి తీయ‌డం అంద‌రిలో అంచ‌నాలు పెంచింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రీతూవర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.తాజాగా సంక్రాంతి కానుక‌గా చిత్ర యూనిట్ మరో పోస్టర్‌ను రిలీజ్ చేసింది.


కాళ్ళ‌కు పారాణితో పంచ‌క‌ట్టులో ఉన్న నానిచుట్టూ బంధువులు అంద‌రూ చేరి, పెళ్లి కొడుకును చేస్తున్నారు. ఇంటిల్లిపాది ఓ చోట చేరి ఉన్న పండ‌గ‌లాంటి పోస్ట‌ర్ సినిమాపై ఆస‌క్తి రేపుతోంది. ఈ పోస్టర్‌లో ప్రముఖ నటులు జగపతి బాబు, నరేష్, రావు రమేష్, నాజర్ తదితరులు కనిపిస్తున్నారు. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 16న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు నాని . తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.


Next Story