జాన్వీ శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ప్పుడు ధ‌రించిన ఉంగ‌రంపై పుకార్లు.. అస‌లు నిజం ఇదే..!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల తిరుమలలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన

By Medi Samrat  Published on  29 Aug 2023 6:13 PM IST
జాన్వీ శ్రీవారిని ద‌ర్శించుకున్న‌ప్పుడు ధ‌రించిన ఉంగ‌రంపై పుకార్లు.. అస‌లు నిజం ఇదే..!

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఇటీవల తిరుమలలోని వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. జాన్వీ తన బాయ్ ప్రెండ్‌ శిఖర్ పహాడియాతో కలిసి శ్రీవారిని ద‌ర్శించుకుంది. ఇందుకు సంబంధించిన‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. జాన్వీ ఉంగరపు వేలికి ఉన్న ఉంగరాన్ని చూసిన అభిమానులు ఆమె నిశ్చితార్థం గురించి కామెంట్లు చేయడం ప్రారంభించారు. అయితే అందులో నిజం ఏంటన్నది ఇప్పుడు వెల్లడైంది.

పింక్‌విల్లా నివేదిక ప్రకారం.. శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డానికి తిరుప‌తికి వెళ్లినప్పుడు జాన్వీ కపూర్ వేలికి ధ‌రించిన‌ ఉంగ‌రానికి, ఆమె నిశ్చితార్థం గురించి వ‌స్తున్న పుకార్ల‌కు ఎటువంటి సంబంధం లేదు. నిజానికి ఆగస్టు 13న దివంగత నటి శ్రీదేవి పుట్టినరోజు. ఆ రోజు జాన్వీ తన తల్లిని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక అందమైన పోస్ట్ చేసింది. కానీ గుడికి వెళ్లలేకపోయింది. ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత జాన్వీ గుడికి వెళ్లింది.

దీంతో పాటు జాన్వీ ఎవరి ఉంగరాన్ని ధరించిందో కూడా తేలింది. నిజానికి అది ఒకప్పుడు శ్రీదేవికి సంబంధించిన ఉంగరం. జాహ్నవి తన తల్లి ఉంగరం ధరించి.. తిరుపతి ఆలయంలో శ్రీవారి దర్శనం చేసుకుంది. జాన్వీ ప్రతి సంవత్సరం తిరుపతి ఆలయాన్ని సందర్శిస్తుంది. అయితే ఆమె భోపాల్‌లో 'ఉల్జ్' చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నందున.. ఈసారి వెళ్ళలేకపోయింది. షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత ఆలయాన్ని సందర్శించింది. ఈ సమయంలో ఆమె తన తల్లి ఉంగరాన్ని ధరించిందని పింక్‌విల్లా నివేదిక పేర్కొంది.

Next Story