మహేష్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ ..! 

Trivikram Mahesh Movie Shooting Starts From Jan 18th. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా

By Sumanth Varma k  Published on  10 Jan 2023 5:44 PM IST
మహేష్ - త్రివిక్రమ్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ ..! 

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'SSMB28'. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జ‌న‌వ‌రి 18 నుంచి మొదలు కానుంది. 18 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు షెడ్యూల్‌ను త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో యాక్షన్ సీన్స్ ను షూట్ చేయబోతున్నట్లు స‌మాచారం. ఈ సినిమా పొలిటికల్ అడ్వెంచర్ గా తెర‌కెక్కుతున్న‌ట్లు.. స్టోరీలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలుస్తోంది.

మహేష్ - త్రివిక్రమ్ గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మహేష్ తో త్రివిక్రమ్ సినిమా అంటే.. భారీ యాక్షన్ తో పాటు భారీ తారాగణం కూడా ఉంటుంది. ఈ మూవీలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో మహేష్-పూజా కాంబినేషన్ లో మహర్షి చిత్రం తెరకెక్కింది. అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ ను సెకండ్ లీడ్ గా తీసుకోనున్నారు. ప్రధాన విలన్ గా సంజయ్ దత్ ను తీసుకోబోతున్నారు. మొత్తానికి ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోంది.


Next Story