అల్లు అర్జున్ సినిమా విషయంలో క్రేజీ రూమర్

Trivikram Experimenting With Allu Arjun. అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టేయగా.. నాలుగో సారి కలసి చేయబోతున్నారని అధికారికంగా ఇటీవల ప్రకటించారు.

By Medi Samrat  Published on  5 July 2023 8:46 PM IST
అల్లు అర్జున్ సినిమా విషయంలో క్రేజీ రూమర్

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టేయగా.. నాలుగో సారి కలసి చేయబోతున్నారని అధికారికంగా ఇటీవల ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించే సినిమా ఈసారి మరింత భారీగా ఉంటుందని అంటున్నారు. త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో భారీ బడ్జెట్ ఫాంటసీ చిత్రాన్ని చేయబోతున్నారని అంటున్నారు.

మొదట్లో ఈ సినిమాను త్రివిక్రమ్ ప్రభాస్‌తో పాన్-ఇండియన్ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని అంటున్నారు. అయితే ప్రభాస్ కు సినిమా కథ చెప్పలేదని అంటున్నారు. త్రివిక్రమ్ ప్రభాస్ కోసం రెడీ చేసిన స్క్రిప్ట్ ఇప్పుడు అల్లు అర్జున్ కోసం వాడనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కోర్ కాన్సెప్ట్‌కు అవసరమైన మార్పులు చేస్తున్నారని.. అల్లు అర్జున్ పాన్-ఇండియన్ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకొని ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చేస్తుండగా.. త్రివిక్రమ్ మహేష్ బాబుతో 'గుంటూరు కారం' సినిమా చేస్తున్నాడు. 2024 వేసవిలో ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టి, 2025 లేదా 2026లో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు.

గతంలో అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో వంటి సినిమాలు వచ్చాయి. ఇక నాలుగో సారి ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.


Next Story