వామ్మో.. దాన్ని కూడా సినిమాలా తీసేశారు

Trailer Of Movie On Johnny Depp-Amber Heard Trial Released. జానీ డెప్-అంబర్ హెర్డ్ వీరిద్దరూ కోర్టుకెక్కిన ఉదంతాన్ని ప్రపంచం మొత్తం

By Medi Samrat
Published on : 30 Sept 2022 8:30 PM IST

వామ్మో.. దాన్ని కూడా సినిమాలా తీసేశారు

జానీ డెప్-అంబర్ హెర్డ్ వీరిద్దరూ కోర్టుకెక్కిన ఉదంతాన్ని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా గమనించింది. వారిద్దరికీ సంబంధించిన విచారణ నెలల తరబడి వార్తల్లో నిలిచింది. తీర్పు వెలువడిన నాలుగు నెలలకు ఏకంగా సినిమా రూపంలో వచ్చేస్తోంది. వివాదాస్పద పరువునష్టం కేసు విచారణ.. వారి మధ్య చోటు చేసుకున్న పరిణామాలను ఇందులో చూపించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

టుబి ఒరిజినల్ ఫిల్మ్ 'హాట్ టేక్: ది డెప్/హెర్డ్ ట్రయల్' గా మీ ముందుకు రాబోతోంది. మార్క్ హప్కా, మేగాన్ డేవిస్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ మొదటి ట్రైలర్‌ను బుధవారం ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ విడుదల చేసింది. మిస్టర్ డెప్.. న్యాయవాది కెమిల్లె వాస్క్వెజ్ పాత్రలో మెలిస్సా మార్టీ నటిస్తోంది. హాట్ టేక్: ది డెప్/హెర్డ్ ట్రయల్ అనేది ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకున్న వివాదాస్పద పరువు నష్టం దావా ఘటన. అప్పట్లో జరిగిన ఘటనల ఆధారంగా ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుండి వస్తున్న టుబి ఒరిజినల్ మూవీ. పోస్ట్ ప్రకారం, ఈ చిత్రాన్ని గై నికోలూచి ("ది డైలీ షో") రాయగా.. సారా లోహ్మాన్ ("సీక్రెట్స్ ఇన్ ది వుడ్స్") దర్శకత్వం వహించారు.


Next Story