టాలీవుడ్ లో విషాదం .. క‌రోనాతో టాలీవుడ్ యువ రచయిత మృతి

Tollywood Writer Vamshi Rajesh Passed Away. క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి

By Medi Samrat  Published on  12 Nov 2020 1:49 PM GMT
టాలీవుడ్ లో విషాదం .. క‌రోనాతో టాలీవుడ్ యువ రచయిత మృతి

క‌రోనా మ‌హ‌మ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ఈ మ‌హ‌మ్మారి భారిన ప‌డిన ఎంతో మంది ప్ర‌ముఖులు కోలుకోగా మ‌రికొంద‌రిని ఈ మ‌హ‌మ్మారి బ‌లి తీసుకుంది. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను కూడా మన మధ్య నుంచి తీసుకువెళ్ళింది. తాజాగా టాలీవుడ్ స్టోరీ రైటర్ వంశీ రాజేష్ కరోనా కారణంగా కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా కరోనా తో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు.

రవితేజ హీరోగా వచ్చిన 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రంతో స్టోరీ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ రాజేశ్. ఇటీవలే కరోనా బారినపడిన వంశీ రాజేశ్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గత రెండు వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ దశలో కోలుకుంటున్నట్టే అనిపించినా.. అకస్మాత్తుగా పరిస్థితి విషమించింది. దాంతో కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను విషాదంలో ముంచెత్తుతూ వంశీ రాజేశ్ తుదిశ్వాస విడిచారు.

వంశీ రాజేష్ మృతి ప‌ట్ల‌ టాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల స్పందిస్తూ, ఎంతో ప్రతిభ ఉన్న వంశీ రాజేశ్ మృతి దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. వంశీ రాజేశ్ తో ఎన్నో మధురజ్ఞాపకాలు ఉన్నాయని, అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
Next Story