కారు ప్రమాదంలో గాయపడ్డ హీరో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఆయన
By అంజి Published on 28 May 2023 11:00 AM ISTకారు ప్రమాదంలో గాయపడ్డ హీరో శర్వానంద్
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఆదివారం ఉదయం 3 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న బ్లాక్ రేంజ్ రోవర్ కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో శర్వానంద్‌కు, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో అక్కడున్న వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలియగానే శర్వానంద్ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు కారును కూడా అక్కడి నుంచి తీసుకెళ్లారు. శర్వానంద్ ఆరోగ్యం గురించి అభిమానులు, నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రమాద స్థలం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. రేంజ్ రోవర్ కారుకు భద్రతా ఫీచర్లు ఉండటం వల్ల పెద్దగా గాయపడలేదు.
అయితే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ యాక్సిడెంట్ పై శర్వానంద్ కానీ, అతని ఫ్యామిలీ కానీ స్పందించలేదు. జూన్ 2, 3 తేదీల్లో శర్వానంద్ పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూధన్‌రెడ్డి కుమార్తె రక్షితారెడ్డిని శర్వానంద్ పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. రక్షిత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. జనవరిలో నిశ్చితార్థం జరిగినప్పుడు శర్వానంద్, రక్షితారెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్ గ్రాండ్ వెడ్డింగ్‌కు ఎంపికైంది. శర్వానంద్, రక్షిత రెడ్డిల వివాహం జూన్ 2, 3 తేదీల్లో జరగనుంది. మెహందీ, సంగీత్, హల్దీ కార్యక్రమాలను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.