పోక్సో కేసులో మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik
పోక్సో కేసులో మరో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో కొరియోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ రియాలిటీ షోతో పాపులర్ అయిన కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్ తమ కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గత నెలలో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ కొరియోగ్రాఫర్‌ను అరెస్ట్ చేయాలని భావించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కృష్ణ మాస్టర్ వెంటనే పరారీలోకి వెళ్లిపోయాడు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. బెంగళూరులో ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అనంతరం కృష్ణ మాస్టర్‌ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా కృష్ణ మాస్టర్‌కు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో అతనిని కంది జైలుకు తరలించారు. అయితే కృష్ణ మాస్టర్‌పై గతంలోనూ ఇదే తరహాలో ఆరోపణలు వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో అమ్మాయిలతో పరిచయం పెంచుకుని పలువురు యువతుల్ని మోసం చేసినట్లుగా ఆయనపై అభియోగాలు ఉన్నాయి.