2020లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ వీరే!

Tollywood Celebrities Marriages In 2020. తెలుగు యువ హీరోలలో ఒకరైన నితిన్ ఈ సంవత్సరం మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.

By Medi Samrat  Published on  27 Dec 2020 11:21 AM IST
2020లో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ వీరే!

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకం. అంతటి ప్రత్యేకమైన వేడుకను ఎంతో ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరుపుకుంటారు. కానీ 2020 సంవత్సరం అలాంటి ఆడంబరాలకు బ్రేకులు వేసింది.కరోనా వ్యాపించడంతో పెళ్లిళ్లకు పెద్ద మొత్తంలో బంధువుల అనుమతి లేకపోవడంతో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే పెళ్లిళ్లు జరిగాయి. అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో నిరాడంబరంగా పెళ్లిళ్లు చేసుకున్నారు. కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకున్న సెలబ్రిటీస్ ఎవరో ఇక్కడ తెలుసుకుందాం...

దగ్గుబాటి రానా:

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా దగ్గుబాటి రానా ఒకరని చెప్పవచ్చు. ఎట్టకేలకు కరోనా సమయంలో రానా ఒక ఇంటివాడయ్యాడు. తన స్నేహితురాలు మిహిక తో ప్రేమ ప్రయాణం సాగించిన రానా ఆగస్టు 8న రామానాయుడు స్టూడియోలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో మీహికా బజాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం రానా వేణు ఊడుగల దర్శకత్వంలో "విరాటపర్వం" సినిమాలో నటిస్తున్నారు.

నితిన్:

తెలుగు యువ హీరోలలో ఒకరైన నితిన్ ఈ సంవత్సరం మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా శాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్న నితిన్ ఈ ఏడాది జూలై హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్ లో శాలిని మెడలో మూడుముళ్లు వేశారు. నితిన్ వివాహానికి ప్రముఖ టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. నితిన్ ప్రస్తుతం "అంధాధున్‌", 'రంగ్‌దే' చిత్రంలో నటిస్తున్నారు.

నిఖిల్:

టాలీవుడ్ మరో యువ హీరో నిఖిల్ కూడా ఈ ఏడాది డాక్టర్ పల్లవి వర్మ ను మే 14న తన ఫామ్ హౌస్ లో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ_ 2 చిత్రంలో నటిస్తున్నారు.

కాజల్ అగర్వాల్:

తన నటన ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ ఈ ఏడాది తన స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ముంబై తాజ్ హోటల్లో వీరి వివాహం జరిగింది. గత కొంతకాలం నుంచి తన స్నేహితుడు గౌతమ్ తో ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు ఓ ఇంటి కోడలు అయింది.

నిహారిక కొణిదెల:

లాక్ డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత మెగా డాటర్ నిహారిక వివాహం ఉదయపూర్ లో డిసెంబర్ 9న ఎంతో ఘనంగా జరిగింది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంది. నిహారిక వివాహానికి మెగా కుటుంబ సభ్యులందరూ మూడు రోజులపాటు ఎంత ఆనందంగా గడిపారు. నిహారిక పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.


Next Story