నటుడు విక్టరీ వెంకటేశ్ ఎమోషనల్ పోస్టు పెట్టారు. తన పెంపుడు శునకం మరణించడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తన పెంపుడు కుక్క ‘గూగుల్’తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన పోస్ట్ పెట్టారు.
గత 12 సంవత్సరాలుగా తమతోనే ఉన్న ‘గూగుల్’ తమ జీవితాల్లో షరతులు లేని ప్రేమను, అందమైన జ్ఞాపకాలను నింపిందని వెంకటేశ్ తెలిపారు. నా ప్రియమైన గూగుల్.. నువ్వే మా జీవితాల్లో వెలుగులు నింపావు. ఈ రోజు నీకు వీడ్కోలు పలికాం. నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేనిది. నా ప్రియ నేస్తమా.. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను అంటూ తన బాధను వ్యక్తం చేశారు.