రాజ్ తరుణ్ కు ఊరట

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ కు ఊరట లభించింది.

By Medi Samrat  Published on  8 Aug 2024 6:45 PM IST
రాజ్ తరుణ్ కు ఊరట

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ కు ఊరట లభించింది. నటి లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య తన ఆరోపణలకు తగిన ఆధారాలు సమర్పించడంతో దర్యాప్తు ప్రారంభించారు. రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణను హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ తరుణ్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.20 వేల పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.

హీరోయిన్ మాల్వి మల్హోత్రా కారణంగా తమ మధ్య గొడవలు వచ్చాయని లావణ్య పలు ఆధారాలను పోలీసులకు సమర్పించింది. మాల్వీ మల్హోత్రా సోదరుడి వల్ల తనకు ప్రాణ హాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేశారని, రాజ్ తరుణ్ తరఫున న్యాయ వాది కోర్టుకు వెల్లడించారు. వాద ప్రతిపాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

Next Story