కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా నటుడు మోహన్ బాబు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలోచేరారు. విపరీతమైన ఒళ్లు నొప్పులు, స్పృహ కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఎడమ కంటి కింద గాయమయింది. నేడు ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వైద్యులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈ మధ్యాహ్నం 2 గంటలకు ఆసుపత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుంచి నేరుగా జల్ పల్లి లోని ఇంటికి చేరుకున్నారు.
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ పై దాడి ఘటనలో BNS 109 సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హైదరాబాద్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను మోహన్ బాబు దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు.