ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిన "టిక్ టాక్ దుర్గారావు"?

Tiktok Star Durga Rao Act in Raviteja Krack Movie. టిక్ టాక్ ద్వారా తన భార్యతో కలిసి స్టెప్పులు వేస్తున్న దుర్గారావు

By Medi Samrat  Published on  31 Dec 2020 5:58 PM IST
ఆ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసిన టిక్ టాక్ దుర్గారావు?

టిక్ టాక్ ద్వారా తన భార్యతో కలిసి స్టెప్పులు వేస్తున్న దుర్గారావు ఒక్కసారిగా ట్రెండ్ అయిపోయారు. తను వేసే డాన్స్ స్టెప్పులు ద్వారా ప్రముఖ సెలబ్రెలను సైతం ఆకట్టుకున్నాడు. తాజాగా దుర్గారావు తన భార్యతో కలిసి "నక్కిలీసుగొలుసు"అనే పాటకు వేసిన స్టెప్పులు అందరిని ఆకర్షించాయి. ముఖ్యంగా చెప్పాలంటే దుర్గారావు ద్వారా ఈ పాట మరింత ఫేమస్ అయ్యి అందరినీ ఆకట్టుకుందని చెప్పవచ్చు.అయితే వీరు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు తన డాన్సులతో ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్నారు. దుర్గారావు యూట్యూబ్ ఛానల్ నడపడానికి కొందరు బుల్లితెర నటులు కూడా సహాయం చేయడం ఎంతో గమనార్హం.

దుర్గారావు నక్కిలీసుగొలుసు పాటకు వేసిన స్టెప్పులు ఎంతగా ఫేమస్ అయ్యాయి అంటే ఈ స్టెప్పులను డాన్సర్ పండు ఒక డాన్స్ షోలో చేసేంత పాపులారిటీని సంపాదించుకున్నాయి. ఈ విధంగా పాపులారిటీని సంపాదించుకున్న దుర్గారావు అతని భార్య పలు బుల్లితెర షో లలో కనిపించి సందడి చేశారు. ఈ విధంగా తమ డాన్సులు ద్వారా ఎంతోమందిని ఆకర్షించిన దుర్గారావుకు ఇప్పుడు వెండితెరపై నటించే ఒక బంపర్ ఆఫర్ ని కూడా కొట్టేసాడు. ఈ విషయాన్ని దుర్గారావు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న క్రాక్ సినిమాలో దుర్గారావుకు నటించే అవకాశం కల్పించారు. ఈ విషయాన్ని స్వయంగా దుర్గారావు తెలియజేస్తూ క్రాక్ సినిమాలో నటించే అవకాశం దక్కిందని, తనని ఆశీర్వదించమని స్వయంగా పోస్ట్ చేశారు. దుర్గారావు చేసిన ఈ పోస్ట్ కు ఎంతో మంది నెటిజన్లు అతనికి కంగ్రాచ్యులేషన్స్, ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. రవితేజ క్రాక్ సినిమాలో దుర్గారావు ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి ఉండాల్సిందే.


Next Story