నెట్టింట వైర‌ల్‌గా మారిన‌ టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ వీడియో

Tiger Shroff's latest video which has gone viral. టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్ కండల వీరుడు. ఎప్పటికప్పుడు తన అభిమానులను

By Medi Samrat
Published on : 8 July 2022 9:00 PM IST

నెట్టింట వైర‌ల్‌గా మారిన‌ టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ వీడియో

టైగర్ ష్రాఫ్.. బాలీవుడ్ కండల వీరుడు. ఎప్పటికప్పుడు తన అభిమానులను అలరించడానికి సోషల్ మీడియాలో పలు వీడియోలు పోస్టు చేస్తూ ఉంటాడు. అతడి డ్యాన్స్ మూవ్స్, ఫిట్‌నెస్ వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులు ఎక్కువగా చూస్తూ ఉంటారు. తాజాగా ఓ వీడియో గురించి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటూ ఉన్నారు. కూ యాప్ లో చర్చించుకుంటూ ఉన్నారు. ఇప్పటివరకు పోస్ట్ చేసిన అన్ని వీడియోల కంటే చాలా భిన్నంగా ఈ వీడియో ఉంది.

ఒక ఫౌంటేన్ ముందు ఎప్పటి లాగే తనదైన శైలిలో టైగర్ ష్రాఫ్ డ్యాన్స్ చేయడం మొదలు పెట్టాడు. ఇంతలో అతడు వేసుకున్న బట్టలు చేంజ్ అవ్వడం మొదలయ్యాయి. ఎడిటింగ్ లో రూపొందించిన ఈ వీడియోలో ఒక్కో స్టెప్ టైగర్ వేస్తూ ఉండగా.. అతడి బట్టలు మారిపోతూ ఉన్నాయి. ఈ వీడియోను టైగర్ ష్రాఫ్ కూ యాప్ ద్వారా షేర్ చేశాడు. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్ వేయండి. ఇక సినిమాల పరంగా టైగర్ ష్రాఫ్ ఇటీవల 'హీరోపంతి 2' తో ఇటీవల అభిమానులను పలకరించాడు. అయితే ఈ సినిమా సినీ ప్రియులను ఆకట్టుకోవడంలో మాత్రం విఫలమైంది.











Next Story