సినిమా షూటింగ్‌లో.. యాక్షన్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ కంటికి గాయం.!

Tiger shroff got eye injury during movie shoot. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అతడు సినిమాలో చేసే యాక్షన్‌ స్టంట్స్‌తో భారీగా

By అంజి  Published on  22 Dec 2021 1:05 PM IST
సినిమా షూటింగ్‌లో.. యాక్షన్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ కంటికి గాయం.!

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అతడు సినిమాలో చేసే యాక్షన్‌ స్టంట్స్‌తో భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. తాను నటించే సినిమాలకు సంబంధించి అప్డేట్‌ను ఎప్పటికప్పుడు టైగర్‌ ష్రాప్‌ అభిమానులకు తెలియజేస్తుంటాడు. ఇదిలా ఉంటే టైగర్‌ కంటికి గాయమైంది. ఈ విషయాన్ని టైగర్‌ ష్రాఫ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఇన్‌స్టా స్టోరీలో తన ఫొటోను షేర్‌ చేసిన ష్రాఫ్‌.. 'షిట్‌ హ్యాపెన్స్‌.. గణపత్‌ ఫైనల్‌ కౌంట్‌డౌన్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. అయితే సినిమా షూటింగ్‌లోనే ఈ గాయం జరిగినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం టైగర్‌ ష్రాఫ్‌ యాక్షన్‌ థ్రిల్లింగ్‌ మూవీ 'గణపత్‌' నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోంది. జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా మొదటి పార్ట్‌ డిసెంబర్‌ 2022లో రిలీజ్‌ కానుంది. ఇటీవల సినిమా యూనిట్‌ ఓ మోషన్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దానికి అభిమానుల నుండి అనూహ్యమైన స్పందన వచ్చింది. గణపత్‌ సినిమాలో బాక్సర్‌ పాత్రలో టైగర్‌ ష్రాఫ్‌ కనిపించనున్నాడు. అయితే ఈ సినిమాలో టైగర్‌కు ఫాదర్‌గా నటించేందుకు అమితా బచ్చన్‌ను సినిమా సంప్రదించారని తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక విషయం మాత్రం ఇంకా వెలువడలేదు.

Next Story