అరుదైన రికార్డును సొంతం చేసుకున్న 'టైగర్ నాగేశ్వర్ రావు'

రవితేజ యొక్క టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 2023లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమా నవంబర్‌ నెల నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.

By Medi Samrat  Published on  29 May 2024 2:15 PM GMT
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న టైగర్ నాగేశ్వర్ రావు

రవితేజ యొక్క టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 2023లో థియేటర్లలో విడుదలైంది. ఆ తర్వాత ఈ సినిమా నవంబర్‌ నెల నుండి స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. భారతదేశంలో సైన్ లాంగ్వేజ్ లో ఈ సినిమా OTTలో విడుదలైంది. ఇలా విడుదలైన తొలి భారతీయ సినిమా ఇదేనని సమాచారం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన సోషల్ మీడియా పేజీలో ప్రకటించారు. “భారత చలనచిత్ర రంగంలో ఒక కొత్త అధ్యాయం. సైన్ భాషలో OTT విడుదలైన మొదటి భారతీయ చిత్రం టైగర్ నాగేశ్వరరావు." అని తెలిపారు. ఈ పని చేసిన చిత్ర బృందంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు.

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, గూఢచారి తదితర చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను నిర్మించారు. వంశీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ స్టువర్ట్ పురం దొంగగా నటించాడు. ఈ చిత్రంలో రవితేజతో పాటు మీనాక్షి భరద్వాజ్, నూపూర్ సనన్ ప్రధాన పాత్రలు పోషించారు. రేణు దేశాయ్ కూడా కీలక పాత్ర పోషించారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతదర్శకుడు. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినప్పటికీ.. భారీ కలెక్షన్స్ సాధించడంలో మాత్రం విఫలమైంది. అయితే ఈ సినిమాకు ఓటీటీలో మాత్రం మంచి స్పందన వస్తోంది.

Next Story