'లైలా మూవీ హీరో' సోదరి ఇంట్లో చోరీ..డైమండ్ రింగ్స్‌తో పరారైన దొంగ

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో చోరీ జరిగింది.

By Knakam Karthik  Published on  16 March 2025 8:45 PM IST
Hyderabad News, Cinema News, Tollywood, Entertainment, Vishwak Sen

'లైలా మూవీ హీరో' సోదరి ఇంట్లో చోరీ..డైమండ్ రింగ్స్‌తో పరారైన దొంగ

టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ సోదరి ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ రోడ్ నెంబర్-8లోని బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్‌లోని ఆమె గదిలో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం చూసి ఆమె ఆందోళన చెందింది. దీంతో వెంటనే పరిశీలించగా రెండు గోల్డ్ డైమండ్ రింగ్స్‌తో పాటు ఒక హెడ్ ఫోన్ కనిపించలేదు. దీంతో విషయాన్ని తన తండ్రి రాజుకు చెప్పగా..ఆయన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు ఆమె నివాసానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించారు. కాగా సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఓ గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి తెల్ల వారుజామున ఇంటి ముందు బైక్ పార్క్ చేసినట్లు గుర్తించారు.

సదరు వ్యక్తి గేటు తీసుకుని నేరుగా మూడో అంతస్తుకు వెళ్లి వెనుక డోర్ నుంచి బెడ్ రూమ్‌లోకి అల్మరాలో ఉన్న బంగారు వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా చోరీ చేసిన సొత్తుతో ఆ దొంగ కేవలం 20 నిమిషాల్లోనే బయటకు వెళ్లి బైక్ మీద అక్కడ నుంచి వెళ్లిపోవడం అక్కడి సీసీటీవీలో రికార్డు అయింది.

Next Story