విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం

విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగులు చేతివాటానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు

By Medi Samrat
Published on : 1 Sept 2025 4:30 PM IST

విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయంలో దొంగతనం

విశాఖ సింహాద్రి అప్పన్న ఉద్యోగులు చేతివాటానికి పాల్పడ్డారు. హుండీ లెక్కింపులో ఇద్దరు ఉద్యోగులు డబ్బులు కొట్టేశారు. ఒకరు పర్మినెంట్‌ ఉద్యోగి రమణ కాగా మరొకరు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి పంచదార్ల సురేష్‌గా గుర్తించారు. ఉద్యోగులిద్దరూ హుండీలో రూ.50 వేలు దొంగిలించారు. ఈ మేరకు ఆలయ పరిపాలన విభాగ AEO రమణమూర్తి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్మినెంట్‌ ఉద్యోగిని ఈవో త్రినాథరావు సస్పెండ్‌ చేశారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని విధుల నుంచి తొలగించే దిశగా చర్యలు చేపట్టారు.

Next Story