'ది లయన్ కింగ్' నటి ఇమాని దియా స్మిత్‌ను దారుణంగా కత్తితో పొడిచి చంపారు. అధికారులు ఆమె ప్రియుడిపై అభియోగాలు మోపారు. డిస్నీ నిర్మించిన ది లయన్ కింగ్ సినిమాలో యంగ్ నాలా క్యారెక్టర్ కు గాత్రదానం చేసినందుకు ప్రసిద్ధి చెందిన ఇమాని దియా స్మిత్ మరణించిందని అధికారులు ధృవీకరించారు. న్యూజెర్సీలో కత్తిపోట్లకు గురై మరణించారు. 25 ఏళ్ల ఆమె డిసెంబర్ 21 ఆదివారం నాడు ఆసుపత్రిలో మరణించినట్లు ప్రకటించారు. ఆమె ప్రియుడు జోర్డాన్ డి. జాక్సన్ స్మాల్ పై హత్య కేసు నమోదు చేశారు.
మిడిల్‌సెక్స్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకారం, ఇమాని దియా స్మిత్ న్యూజెర్సీలోని ఎడిసన్ ప్రాంతంలోని ఒక నివాసంలో కత్తిపోట్లతో కనిపించింది. ఆమెను రాబర్ట్ వుడ్ జాన్సన్ విశ్వవిద్యాలయ ఆసుపత్రికి తరలించారు, అయితే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు.