హమ్మయ్య ఓటీటీలోకి 'కేరళ స్టోరీ'.. ఈసారి కన్ఫర్మ్

2023లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఎదురుచూస్తూ ఉన్నారు

By Medi Samrat  Published on  6 Feb 2024 8:45 PM IST
హమ్మయ్య ఓటీటీలోకి కేరళ స్టోరీ.. ఈసారి కన్ఫర్మ్

2023లో బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన 'ది కేరళ స్టోరీ' సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఎదురుచూస్తూ ఉన్నారు. గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి అడుగుపెడుతూ ఉంది. ఈ సినిమాకు ఓటీటీ రిలీజ్ కు సంబంధించి గతంలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.

ఈ సినిమా ఫిబ్రవరి 16 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. జీ5 ఓటీటీ ప్లాట్ ఫామ్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' సినిమాను విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలోని అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు పలువురు విమర్శలు గుప్పించారు. కొన్ని రాష్ట్రాలలో ఈ సినిమా విడుదల కూడా అవ్వలేదు. బ్యాన్ చేయాలంటూ పలు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇక ఓటీటీలో విడుదలయ్యాక ఎలాంటి చర్చ జరుగుతుందో చూడాలి.

Next Story