'ది కేరళ స్టోరీ' సినిమాపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదా శర్మ ఫాతిమా బా పాత్రను పోషించింది. టెర్రర్ గ్రూప్ ఇస్లామిక్ స్టేట్ (IS)లో చేరిన 32,000 మంది మలయాళీ అమ్మాయిలలో ఆమె కూడా ఒకరనే విధంగా చూపించారు. మే 5న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో సినిమాను అడ్డుకోవాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగా తీసినది కాదని.. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీసినదని అదాశర్మ తెలిపారు. "కథ నిజంగా భయానకంగా ఉంది. అమ్మాయిలు తప్పిపోవడాన్ని మేము ప్రజల ముందు ఉంచి.. వాస్తవాల గురించి తెలియజేయడానికి ప్రయత్నించాం. అమ్మాయిలు తప్పిపోయారనే విషయం గురించి చర్చించాలి, సంఖ్యల గురించి ఆ తర్వాత మాట్లాడుకుందాం”అని అదా శర్మ ANI కి చెప్పారు.
డైరెక్టర్ సుదీప్తో సేన్ మాట్లాడుతూ.. ఈ సినిమా తీయడానికి ముందు చాలా రీసెర్చ్ చేశామని, దాదాపు ఏడేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డామని తెలిపారు. అమ్మాయిల మిస్సింగ్ కథ విన్నప్పుడు ఇలాంటివి మన దేశంలో కూడా జరుగుతాయా అనుకున్నానని సుదీప్తో సేన్ అన్నారు. రీసెర్చ్ చేశాక నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోయానని చెప్పారు.అంతా తెలుసుకున్నాకే సినిమా తీశానని వివరించారు.