మైక్ టైసన్ ను దింపిన పూరీ జగన్నాథ్

The Great Myke Tyson On Board For Liger. పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'.

By M.S.R  Published on  27 Sep 2021 12:10 PM GMT
మైక్ టైసన్ ను దింపిన పూరీ జగన్నాథ్

పూరీ జగన్నాథ్- విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. భారీ బడ్జెట్ తో.. ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను రూపొందిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను చిత్ర యూనిట్ ఈరోజు పంచుకుంది. ఈ సినిమా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే..! అందులో ఓ క్రేజీ ఫైట్ కోసం ఏకంగా మైక్ టైసన్ ను దింపనున్నారు. ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మైక్ టైసన్ ఎంతో ఫేమస్..! అమెరికా యోధుడు ఇప్పుడు తెలుగు సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజిలో రూపొందిస్తూ ఉన్నారు. భారతీయ వెండితెరపై మైక్ టైసన్ ఓ సినిమాలో నటించడం ఇదే తొలిసారి అని చిత్ర యూనిట్ తెలిపింది. నమస్తే టైసన్ అంటూ స్వాగతం పలికింది. సినిమా కేవలం థియేటర్లలో మాత్రమేనని కూడా చెప్పుకొచ్చింది.

లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండ మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ ప్రారంభమైందని కొద్దిరోజుల కిందటే చిత్ర బృందం తెలియజేసింది. ఈ మేరకు షూటింగ్‌ స్పాట్‌లో ఉన్న విజయ్‌ దేవరకొండ ఫొటోని విడుదల చేసింది. ఇందులో విజయ్‌ జుట్టుతో షర్ట్‌లేకుండా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ రింగ్‌లో కూర్చొని ఉన్నాడు. లైగ‌ర్ చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌లో ఉంది.Next Story