సలార్ వర్సెస్ డంకీ.. బాక్సాఫీస్ వార్ లో గెలిచింది ఎవరంటే.?

క్రిస్మస్ సమయంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి

By Medi Samrat  Published on  17 Jan 2024 12:23 PM GMT
సలార్ వర్సెస్ డంకీ.. బాక్సాఫీస్ వార్ లో గెలిచింది ఎవరంటే.?

క్రిస్మస్ సమయంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్, షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన డంకీ సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఫైనల్ విజేత ఎవరో మీరే నిర్ణయించండి. మీకు కలెక్షన్స్ మేము చెప్తాము..! డంకీ జవాన్ లాంటి పాన్ ఇండియా సినిమా కానందున హిందీని మినహాయించి మరే ఇతర మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకోలేదు. ఇది కేవలం హిందీ చిత్రం కాబట్టి దక్షిణాది మార్కెట్‌లను లక్ష్యంగా చేసుకుని విడుదల చేయలేదు. సలార్, డంకీ సినిమాల మధ్య ఘర్షణ ప్రధానంగా హిందీ మార్కెట్లలో జరిగింది. కలెక్షన్ల విషయానికి వస్తే, డంకీ భారతదేశంలో 228 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ 270 కోట్లు ఉండవచ్చు.. ఓవర్సీస్ లో ఈ సినిమా దాదాపు 190 కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ 460 కోట్లకి చేరుకుంది.

సలార్ హిందీ వెర్షన్ 152 కోట్ల నెట్ వసూలు చేసింది. గ్రాస్ దాదాపు 180 కోట్లు ఉంది. ఓవర్సీస్ గ్రాస్ దాదాపు 25 కోట్లు ఉంటుంది. సలార్ హిందీ వెర్షన్ ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ దాదాపు 205 కోట్లు మాత్రమే ఉంది. హిందీలో సలార్ కంటే డంకీకి 2.25 రెట్లు ఎక్కువ కలెక్ట్స్ వచ్చాయి. అయితే షారుఖ్ ఖాన్ స్ట్రెయిట్ హిందీ సినిమా అంచనాలకు తగ్గట్టుగా 700 కోట్లు తక్కువలో తక్కువ వసూలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా డంకీ అంచనాలు అందుకోలేక చతికిల పడ్డింది. ప్రభాస్- KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబో హిందీలో కనీసం 350 - 400 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి ఉండాలి, అయితే ఇది కేవలం 200 కోట్ల రేంజ్‌లో వసూలు చేసింది. కాబట్టి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన కనబర్చడంలో విఫలమయ్యాయని స్పష్టంగా తెలుస్తోంది. భారీ క్లాష్ జరిగి.. ఊహించని వసూళ్లు సొంతం చేసుకుంటాయి ఈ సినిమాలు అని అనుకుంటే అంచనాలు అందుకోలేక పోయాయి.

Next Story