బాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. నటి, మోడల్ అర్య బెనర్జీ(33) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ది డర్టీ పిక్చిర్'లో విద్యాబాలన్‌తో కలిసి నటించిన ఆమె కోల్‌కతాలోని తన నివాసంలో శవమై కనిపించారు. ఇంటి పని మనిషి వచ్చి ఎంత సేపు తలుపు కొట్టినా.. ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో ఇరుపొరుగు వారికి పని మనిషి ఈ విషయాన్ని చెప్పింది. అనుమానం వచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి అపార్ట్‌మెంట్ తలుపులు బద్దలు కొట్టిలోనికి ప్రవేశించారు. బెడ్‌పై బెనర్జీ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతకొంతకాలం నుంచి కోల్‌కత్తాలోని తన నివాసంలో బెనర్జీ ఒంటరిగా నివసిస్తున్నారు. అంతేకాకుండా ఆమె వాంతులు చేసుకున్నాట్లు గుర్తులు కనిపిస్తున్నాయని, ఆమె తన నివాసంలో పడిపోయిఉందని, నేలపై కొన్ని రక్తపు చుక్కలు ఉన్నాయని చెప్పారు. బెనర్జీది హత్య, ఆత్మహత్య అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు.
ఆర్యా అసలు పేరు దావదత్తా బెనర్జీ. ఈమె ఎల్‌సీడీ, లవ్ సెక్స్ ఔర్ ధోకా, డర్టీ పిక్చర్ సినిమాలలో నటించారు. అంతేకాకుండా కొన్నాళ్లపాటు మోడలింగ్ కూడా చేశారు. ఈమె మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి పట్ల సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు.