నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ రన్ దాదాపుగా ముగించింది. మహా శివరాత్రి పర్వదినం రోజున సినిమాకి ఆఖరి రోజు అవుతుందని భావిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఈ సినిమా స్పెషల్ షోలు రాత్రి సమయంలో వేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా దాదాపు 85 కోట్ల గ్రాస్ షేర్ వసూలు చేసింది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా నాగ చైతన్యకి బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమా OTT రిలీజ్ కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే వారాంతంలో అన్ని భాషల్లో విడుదల చేయడం దాదాపు ఖాయంగా చెబుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది, అయితే ట్రేడ్ పరంగా ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమాపై పైరసీ తీవ్ర ప్రభావం చూపించింది.