గేమ్ ఛేంజర్ టీజర్ కూడా వచ్చేస్తోంది..!
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రెండో సింగిల్ రిలీజ్ తో సినిమా విషయంలో సందడి మొదలైంది.
By Medi Samrat Published on 2 Oct 2024 6:42 PM ISTరామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రెండో సింగిల్ రిలీజ్ తో సినిమా విషయంలో సందడి మొదలైంది. 'రా మచా మచ్చ' అనే సింగిల్ ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైంది. ఇది కొన్ని మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇన్ని రోజులూ సినిమాకు సంబంధించి కాస్త సైలెంట్ గా ఉన్న మూవీ టీమ్ ఇప్పుడు మరింత యాక్టివ్ అయింది.
త్వరలో గేమ్ ఛేంజర్ సినిమా టీజర్ కూడా విడుదల చేయనున్నారు. గేమ్ ఛేంజర్ టీజర్ దసరాకి రానుందనే టాక్ నడుస్తూ ఉండగా.. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ కూడా ఓ ట్వీట్ ద్వారా ధృవీకరించారు. టీజర్‌కి సంబంధించిన పనులు కూడా పూర్తయ్యాయని సమాచారం. గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కానీ.. సినిమా కంటెంట్ ఏమిటో చెప్పడానికి అఫీషియల్ గా ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు. అందుకే టీజర్ విషయంలో మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇండియన్ 2తో భారీ పరాజయాన్ని చవిచూసిన దర్శకుడు శంకర్‌కి గేమ్ ఛేంజర్ చాలా కీలకమైన చిత్రం. ఇండియన్ 2 శంకర్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కాబట్టి గేమ్ ఛేంజర్ విజయం ఆయనకు చాలా ముఖ్యమైనది.