తమిళ స్టార్ హీరో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించి రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. తన రాజకీయ జీవితం కోసం తన సినీ జీవితాన్ని వదులుకున్నాడు. 2026లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నందున, నటుడు ప్రస్తుతం తన 69వ చిత్రం కోసం పని చేస్తున్నాడు. అయితే తనకు అండగా మీడియా సంస్థలు కూడా ఉన్నాయని అనుకున్నారో ఏమో కానీ విజయ్ తన సొంత టీవీ ఛానెల్‌ని ప్రారంభించనున్నారు.
విజయ్ తన పార్టీ భారీ విజయం సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీతో పారదర్శకమైన, కుల రహిత, అవినీతి రహిత పరిపాలన అందిస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. నివేదికల ప్రకారం, తలపతి విజయ్ తన స్వంత టీవీ ఛానెల్‌ని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు టీవీ ఛానెల్‌ని నిర్వహిస్తున్నాయి. అందుకే విజయ్ కూడా త్వరలోనే టీవీ ఛానల్ లాంఛ్ పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.