త్రిషతో కలిసి వివాహ వేడుకకు హాజరైన విజయ్.. వీడియో వైరల్..!

తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్, నటి త్రిష కృష్ణన్‌తో కలిసి ఒక వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు.

By -  Medi Samrat
Published on : 6 March 2026 11:00 AM IST

త్రిషతో కలిసి వివాహ వేడుకకు హాజరైన విజయ్.. వీడియో వైరల్..!

తమిళ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్, నటి త్రిష కృష్ణన్‌తో కలిసి ఒక వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన ఒక వాహ రిసెప్షన్‌కు వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. విజయ్, త్రిష ఒకే వేదికపై కనిపించారు.

విజయ్ సాధారణ ఫార్మల్ దుస్తుల్లో కనిపించగా, త్రిష సంప్రదాయబద్ధంగా చీరకట్టులో మెరిశారు. పెళ్లి వేదికపై కొత్త దంపతులను ఆశీర్వదించి, వారితో కలిసి ఫోటోలు దిగారు. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, తన సహనటి త్రిషతో కలిసి ఇలా బహిరంగంగా కనిపించడం విమర్శలకు తావిస్తూ ఉంది. వీరిద్దరూ గతంలో 'గిల్లి', 'కురువి', 'తిరుప్పాచి', 'లియో' వంటి చిత్రాల్లో కలిసి నటించారు.

Next Story