ఈగ సుదీప్ సినిమా.. తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతోంది

Telugu version of Kichcha Sudeep's Kotigobba 3 to release in theatres. కిచ్చా సుదీప్ కన్నడ చిత్రం 'కోటిగొబ్బ 3' మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై కన్నడ బాక్సాఫీస్

By అంజి
Published on : 30 Jan 2022 8:30 PM IST

ఈగ సుదీప్ సినిమా.. తెలుగులో రిలీజ్ కు సిద్ధమవుతోంది

కిచ్చా సుదీప్ కన్నడ చిత్రం 'కోటిగొబ్బ 3' మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలై కన్నడ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. శివ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి స్పందన దక్కించుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఫిబ్రవరి 4, 2022 న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. 'కె-3 కోటికొక్కడు' పేరుతో వచ్చే వారంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసారు. అంతకుముందే సుదీప్ ఈగ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సుదీప్‌తో పాటు కోటిగొబ్బ 3లో మడోన్నా సెబాస్టియన్, శ్రద్ధా దాస్, అఫ్తాబ్ శివదాసాని, పి. రవిశంకర్ ప్రముఖ పాత్రలు పోషించారు.

సుదీప్ హీరోగా 'విక్రాంత్ రోనా' సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. 2022లో విడుదలయ్యే సినిమాల విషయంలో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది ఒకటి. అనూప్ భండారి దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదల కావాల్సి ఉండగా, పెరుగుతున్న కోవిడ్-19 కేసుల కారణంగా వాయిదా పడింది. కిచ్చా సుదీప, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్యపాత్రల్లో నటించిన విక్రాంత్ రోనాను జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మించారు.

Next Story