నటి కల్పికపై నమోదైన రెండు కేసుల్లో అరెస్ట్ చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. గతంలో ప్రిజం పబ్‌లో జరిగిన గొడవపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తోందని సైబర్ క్రైమ్ లో మరో కేసు నమోదైంది. అయితే ఈ రెండు కేసుల్లో ఆమెను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కల్పిక ఇక నగర శివారులోని కనకమామిడి రెవెన్యూ పరిధిలో గల బ్రౌన్‌టైన్ రిసార్ట్‌లో సృష్టించిన హంగామా కూడా చర్చనీయాంశంగా మారింది. సోమవారం మధ్యాహ్నం బ్రౌన్‌టైన్ రిసార్ట్‌కు చేరుకున్న కల్పిక ఓ గదిలో విశ్రాంతి తీసుకుని భోజనం చేసింది. సిగరెట్లు కావాలని రిసెప్షన్ సిబ్బందిని అడగగా, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో కల్పిక తీవ్ర ఆగ్రహానికి గురైంది. నేరుగా రిసెప్షన్‌కు వెళ్లి మేనేజర్ కృష్ణపై మండిపడింది. మంగళవారం కల్పిక ఒక వీడియోను విడుదల చేసింది. రిసార్ట్ సిబ్బంది తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆ వీడియోలో ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మొయినాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.