ప్రభాస్ ఫ్యాన్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షోలు..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ సినిమాకు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షోకు

By Medi Samrat  Published on  19 Dec 2023 7:48 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్‌కు ప్రభుత్వం గుడ్ న్యూస్.. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షోలు..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ సినిమాకు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షోకు పర్మిషన్ ఇచ్చింది. సలార్ సినిమా టికెట్ల ధరల విషయానికి వస్తే..సింగిల్ థియేటర్లో టికెట్ రేట్ రూ.65 పెంచగా.. మల్టీప్లెక్స్లో టికెట్ ధరకు అదనంగా రూ.100 పెంచారు. ఏపీ ప్రభుత్వం 'సలార్' టికెట్ రేటును 40 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృద్విరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక భారతదేశం అంతటా కూడా సలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశం అంతటా 1 AM షోలను ప్రదర్శించడానికి అవకాశం, అనుమతి ఉన్న చోట ప్రదర్శించాలని ప్లాన్ చేసారు. భారతదేశం అంతటా సాలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇండస్ట్రీ సర్కిల్‌ల నుండి కూడా సానుకూల నివేదికలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సాలార్ ఔట్‌పుట్‌తో సంతృప్తి చెందానని ఇప్పటికే చెప్పాడు. ఇక మిగిలిన చాలా ప్రాంతాలలో ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్‌లు తెరవనున్నారు.

Next Story