రాష్ట్రంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గత గురువారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. బుధ, గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.