నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్.. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చ‌ర్చ‌కు సిద్ధ‌మా

Tammareddy Bharadwaj challenges andhrapradesh leaders.ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌పై అధికార పార్టీ నాయ‌కులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 4:25 PM IST
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సవాల్.. మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో చ‌ర్చ‌కు సిద్ధ‌మా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌పై అధికార పార్టీ నాయ‌కులు చేస్తున్న వ్యాఖ్య‌లపై దుమారం రేగుతోంది. ఏపీ నేతలు చేస్తున వ్యాఖ్యలపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని ఫిలిం ఛాంబ‌ర్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. కుల ప్ర‌స్తావ‌న లేకుండా అంద‌రికీ ఉపాధి క‌ల్పిస్తున్న ఏకైక రంగం సినీ ప‌రిశ్ర‌మేన‌ని, అలాంటి ప‌రిశ్ర‌మ‌పై నింద‌లు వేసిన నాయ‌కులు త‌ల‌దించుకోవాల‌న్నారు.

సినిమా విషయంలో కులాలు, మతాలు ఎందుకంటూ ధ్వ‌జ‌మెత్తారు. పుష్ప నిర్మాతలు ఫలానా కులానికి చెందిన వారు కాబట్టే.. వేరే కులాల వారిని తిట్టారంటున్నారు. గతంలో కొందరు నాయ‌కులు ఇలాగే రెచ్చిపోయి మాట్లాడారు. వాళ్లు గడ్డితిన్నారని.. మీరూ గడ్డి తింటారా? అని ప్ర‌శ్నించారు. మీరు ఓ కుల‌పువారు ఓట్లేస్తే గెల‌వ‌లేదు. అన్ని వ‌ర్గాల వాళ్లు వేస్తేనే గెలిచార‌న్నారు. సామాజిక వ‌ర్గాల పేరుతో రాద్దాంతం ఎందుకు చేస్తున్నారు..? సినిమా వాళ్లు అంత లోకువ అయిపోయారా..? అని ప్ర‌శ్నించారు.

మీ ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మా..? అని స‌వాల్ విసిరారు. మీరు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ప్పుడూ మీ ఆస్తులెంత‌..? ఇప్పుడెంత‌..? అని ప్ర‌శ్నించారు. వందల మంది కష్టపడితే వచ్చే ప్రాజెక్టు సినిమా అని అన్నారు. రాజకీయ నాయకుల్లాగా రూపాయి పెట్టి కోట్లు తినట్లేదన్నారు. రాజ‌కీయ నాయ‌కులు ఇంకెప్పుడు బెదిరింపుల‌కు పాల్ప‌డవ‌ద్ద‌ని సూచించారు. సినీ ప‌రిశ్ర‌మ అంటే నిర్మాత‌ల మండ‌లి అని చెప్పారు.

Next Story