డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్‌

తమిళ, తెలుగు భాషా నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు.

By Medi Samrat
Published on : 23 Jun 2025 6:07 PM IST

డ్రగ్స్ కేసులో నటుడు శ్రీరామ్ అరెస్ట్‌

తమిళ, తెలుగు భాషా నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. మాదకద్రవ్యాల వాడక ఆరోపణల‌పై దర్యాప్తులో ఉన్నాడు. ఏఐఏడీఎంకే మాజీ నేత ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు శ్రీరామ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆయనను రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ శ్రీరామ్ రక్త నమూనాలను సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే మాజీ నేత ప్రసాద్‌తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

శ్రీకాంత్ సినిమాల్లో అవకాశాల కోసం చిన్న వయసులోనే చెన్నైకి వెళ్లారు. తన పేరును శ్రీరామ్‌గా మార్చుకుని చిన్న పాత్రలు పోషించారు. 'రోజా పూలు' సినిమాతో తెలుగు, తమిళ భాషల్లో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 'ఒకరికి ఒకరు' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని పలు భాషల్లో నటించారు.

Next Story