ఆర్ధిక సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రముఖ నటుడు!
Tamil actor Ponnambalam hospitalised. ప్రముఖ నటుడు, విలన్ పొన్నాంబళం ఆర్థిక పరిస్థితి క్షీణించడంతో హాస్పిటల్‌లో చికిత్స
By Medi Samrat
ఆయన సోదరుడి కొడుకు కిడ్నీ దానం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేసాడు. అయితే ఎలాంటి ఆదాయం లేకపోవడంతో తన కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేక కూమిలిపోతోందని ఓ ప్రకటనలో తెలియజేశాడు. రజనీకాంత్, కమల్ హాసన్, రాధిక శరత్ కుమార్, ధనుష్, కె ఎస్ రవికుమార్, రాఘవ లారెన్స్, ఐసరి గణేష్ వంటి ప్రముఖులు ఇప్పటికే పొన్నంబళంకు ఆర్ధిక చేయం చేయగా, ఇప్పుడు కిడ్నీ మార్పిడి కోసం దాతలు, దక్షిణ భారత నటీనటుల సంఘం, తెలుగు మా అసోసియేషన్ తరపున తగిన ఆర్ధిక సాయం అందించాలని నటుడు పొన్నంబళం వేడుకొన్నారు.
గత రెండు దశాబ్దాల కాలంలో నటుడు పొన్నాంబళం రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విక్రమ్ లాంటి ప్రముఖ నటులతో నటించారు. వాస్తవానికి ఆయన స్టంట్ మ్యాన్‌గా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన నాట్టమై చిత్రంతో మంచి ప్రేక్షకాదరణ పొందారు. ఆ తర్వాత రజనీతో ముత్తు, అరుణాచలం, అజిత్‌తో అమరకాలం, విక్రమ్‌తో సామి, కమల్ హాసన్‌తో అపూర్వ సహోదరులు, మైఖేల్ మదన కామరాజు చిత్రాల్లో నటించారు.
కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్ రెండో సీజన్‌లో పొన్నాంబళం పాల్గొన్నారు. జయం రవి నటించిన కోమలి చిత్రంలో చివరిసారిగా నటించారు. ఇదిలా ఉంటే.. పొన్నాంబళం ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుసుకొన్న కమల్ హాసన్ స్వయంగా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ కండీషన్ గురించి తెలుసుకొన్నారు. ఇక సినిమా రంగంలోనే కాకుండా రాజకీయం రంగంలో కూడా అడుగపెట్టారు. 2011లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంతగా గుర్తింపు పొందలేకపోయారు.