పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా

Tamannaah denied the marriage news. నటి తమన్నా భాటియా పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే..

By Medi Samrat  Published on  16 Nov 2022 7:45 PM IST
పెళ్లి వార్తలను ఖండించిన తమన్నా

నటి తమన్నా భాటియా పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే..! మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తోంది. ఈ ప్రచారాన్ని తమన్నా ఖండించింది. తనకు పెళ్లంటూ జరుగుతున్న రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని తమన్నా తేల్చి చెప్పింది. తన జీవితానికి ప్రతి ఒక్కరూ స్క్రిప్ట్ రాసేస్తూ ఉన్నారని.. తాను ఏ బిజినెస్ మ్యాన్ ను పెళ్లి చేసుకోలేదని తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది. తమన్నా ప్రస్తుతం 'భోళా శంకర్' చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. దీంతోపాటు, ఓ తమిళ చిత్రాన్ని కూడా చేస్తోంది.


Next Story