పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టిన తమన్నా

Tamannaah Bhatia finally reacted about marriage. నటుడు విజయ్ వర్మతో తన ప్రేమ వ్యవహారాన్ని నటి తమన్నా ఇటీవలే ఒప్పుకొంది.

By Medi Samrat  Published on  17 Jun 2023 5:39 PM IST
పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టిన తమన్నా

నటుడు విజయ్ వర్మతో తన ప్రేమ వ్యవహారాన్ని నటి తమన్నా ఇటీవలే ఒప్పుకొంది. విజయ్ తో కలిసి ఉంటే ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఆమె ఒకరితో డేటింగ్‌లో ఉన్నట్లు బహిరంగంగా అంగీకరించడం ఇదే తొలిసారి. తమన్నా విజయ్ తో ఉన్న ప్రేమను అంగీకరించి తన అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.

మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు.. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపింది తమన్నా. పెళ్లి అనేది పెద్ద బాధ్యత. ఇది పార్టీ కాదు. జీవితంలో అతి పెద్ద బాధ్యతను తీసుకునే ముందు బాగా ఆలోచించాలి. సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ వైపు అడుగులు వేయగలరని తమన్నా తెలిపింది. ఇతరులు పెళ్లి చేసుకుంటారు కదా అని.. నేను కూడా చేసుకోవాలి అని మాత్రం అనుకోను అని తమన్నా తెలిపింది. తమన్నా కొత్త వెబ్ సిరీస్ 'జీ కర్దా' ప్రమోషన్స్ లో పలు విషయాలపై తమన్నా స్పందించింది. తమన్నా విజయ్ తో తన రిలేషన్ షిప్ గురించి బయట పెట్టింది.


"నాకు చాలా మంది సహ నటులు ఉన్నారు. కానీ, విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. నాకు రక్షణగా ఉంటాడు అనే నమ్మకం ఉంది. మా ఇద్దరి మధ్య చాలా మంచి బంధం ఉంది. నన్ను కిందకి లాగే వారి నుండి రక్షిస్తాడు. నా కోసం ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అనుకోకుండా ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి వచ్చాడు. అతను నా పట్ల చాలా శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న ప్రదేశం నాకు సంతోషకరమైన ప్రదేశం’’ అంటూ తమన్నా తెలిపింది. తమన్నా చిరంజీవి భోళా శంకర్‌లో కనిపించనుంది. విజయ్ వర్మతో కలిసి ఆమె నటించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29న విడుదల కానుంది. తమిళంలో జైలర్ సినిమాలో తమన్నా సందడి చేయనుంది. ఈ సినిమాలో రజనీకాంత్ నటిస్తూ ఉన్నారు.


Next Story