ప్రముఖ టాలీవుడ్ నటి తమన్నా భాటియా తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటీమణులలో ఒకరిగా నిలిచింది. తమన్నా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రం, ‘ఓదెల-2’ కోసం, తమన్నా ఏకంగా 4 కోట్ల రూపాయలను అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతకుముందు తమన్నా మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన భోలా శంకర్ సినిమా కోసం 3 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కోసం నాలుగు కోట్లను తీసుకుందని తెలుస్తోంది.
ఓదెల 2 సినిమాలో తమన్నా చాలా కొత్తగా కనిపించబోతోంది. ఒక మహిళా అఘోరాగా పాత్రను పోషిస్తోంది. తమన్నా తన కెరీర్ లో చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు వంటి అగ్ర తారలతో నటించింది. జైలర్‌లోని “కావాలయ్యా”,స్త్రీ 2లో “ఆజ్ కీ రాత్” స్పెషల్ సాంగ్ తో మెప్పించింది. తమన్నా చిన్న వయసులోనే సినిమాల్లో హీరోయిన్ గా వచ్చి దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. ఇప్పుడు అటు వెబ్ సిరీస్, ఇటు స్పెషల్ సాంగ్స్ చేస్తూ తమన్నా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.