గాయపడ్డ టబు.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి

Tabu Injured on 'Bholaa' Set, Was Shooting a Stunt Sequence in Dense Jungle. అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమాలో నటి టబు పోలీస్ ఆఫీసర్

By Medi Samrat  Published on  10 Aug 2022 3:15 PM GMT
గాయపడ్డ టబు.. కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమాలో నటి టబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‏లో జరుగుతుంది. తాజాగా చిత్రీకరణంలో ప్రమాదం చోటు చేసుకుందని.. హీరోయిన్ టబు తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఆమె కంటికి గాయమై రక్తస్రావం జరిగిందట. భోలా షూటింగ్‏లో భాగంగా ఓ యాక్షన్ సన్నివేశం కోసం టబు దట్టమైన అడవిలో ట్రక్కు నడుపుతోంది. ఆమెను బైక్ పై కొందరు విలన్స్ వెంబడిస్తుంటారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన బైక్ ట్రక్కును ఢీకొట్టడంతో ట్రక్కు అద్దాలు పగిలి టబుకు గాయాలయ్యాయని తెలుస్తోంది. కంటికి.. నుదిటిపై.. కనుబొమ్మలకు గాయమై తీవ్రంగా రక్తస్రావం అయినట్లుగా సమాచారం. వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

నటి శిల్పాశెట్టి కూడా షూటింగ్‌లో గాయపడింది. ఆమె నటిస్తున్న వెబ్‌ సిరీస్‌లోని యాక్షన్‌ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఈ విషయాన్ని శిల్పా స్వయంగా సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఇండియన్‌ పోలీసు ఆఫీసర్‌' వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా చేస్తుండగా.. శిల్పా పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ఇసుకలో పలు భారీ యాక్షన్‌ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో శిల్పా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఆమెను ఆరు వారాల పాటూ రెస్ట్ తీసుకోమన్నారు వైద్యులు.


Next Story
Share it