బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు పాల్గొన్నారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కొందరు నటీనటుల పేర్లను సోషల్ మీడియాలోనూ, కొన్ని మీడియా సంస్థల్లోనూ ప్రముఖంగా ప్రచురించారు. అయితే ఈ లిస్టులో యాంకర్ శ్యామల పేరు కూడా వినిపించింది. అయితే తనకు ఈ రేవ్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని.. కొందరు పనిగట్టుకుని తన పేరును ప్రచారం చేస్తూ ఉండడంతో వారిపై లీగల్ యాక్షన్ తీసుకోడానికి తాను సిద్ధమేనని అన్నారు.
బెంగళూరు ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో శ్యామల పాల్గొన్నట్లు పుకార్లు వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు హేమ వంటి ఇతర నటీనటులతో పాటు శ్యామల కూడా ఉన్నట్లు కథనాలను ప్రచురించాయి. ఈ వీడియోలు, వార్తా కథనాలపై శ్యామల స్పందిస్తూ, తన పరువు తీసేందుకు ప్రయత్నించిన మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బెంగుళూరులో రేవ్ పార్టీ జరిగిన రోజుల్లో తన ఇంటిని కూడా వదిలి వెళ్లలేదని అన్నారు. కొన్ని రాజకీయ శక్తులు కావాలనే నా పరువు తీసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించాయి.. కానీ నేను బెంగళూరు వెళ్లలేదన్నది నిజమని వివరించింది.