రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన హీరోయిన్.. ఎందుకంటే..?

Swetha Basu prasad Visited Red light area. తాజాగా ఆమె `ఇండియా లాక్‌డౌన్‌` అనే సినిమాలో సెక్స్ వ‌ర్క‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌ని అనుకున్న శ్వేతా.. ఆ మూవీ టీమ్ తో క‌లిసి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లింది.

By Medi Samrat  Published on  5 Feb 2021 11:12 AM GMT
రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లిన హీరోయిన్.. ఎందుకంటే..?

శ్వేతాబ‌సు ప్ర‌సాద్.. వ‌రుణ్ సందేశ్‌కు జంట‌గా `కొత్త బంగారు లోకం`లో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది ఈ బెంగాళీ భామ‌‌. అయితే ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా సినిమాల్లో మెరిసినా.. కెరీర్ సాఫీగా సాగ‌క‌‌ అమ్మ‌డు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్త‌ల్లో నిలిచింది. అనంత‌రం నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్‌ను పెళ్లి చేసుకుంది‌. వైవాహిక జీవితం క‌డా ఎక్కువ కాలం స‌జావుగా సాగ‌లేదు. విడాకులు తీసుకుని ఇద్ద‌రూ విడిపోయారు.

అయితే.. ప్ర‌స్తుతం శ్వేతా బ‌సు ప్ర‌సాద్ త‌న సెకండ్ ఇన్నింగ్సు స్టార్ట్ చేసింది. తాజాగా ఆమె `ఇండియా లాక్‌డౌన్‌` అనే సినిమాలో సెక్స్ వ‌ర్క‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ బండార్క‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా విధించిన‌ లాక్‌డౌన్ స‌మ‌యంలో ముంబై రెడ్‌లైట్ ఏరియాలో సెక్స్ వ‌ర్క‌ర్లు చాలా ఇబ్బందుల‌ను ఎదుర్కొన్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకోవాల‌ని అనుకున్న శ్వేతా.. ఆ మూవీ టీమ్ తో క‌లిసి రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లింది.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ‌.. నేను, మ‌ధు స‌ర్‌, నా టీమ్.. రెండు వారాల క్రితం కామాటిపుర వెళ్లాం. అక్క‌డి వారి యాస‌ను బ‌ట్టి ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. అక్క‌డికి వెళ్ల‌డం లైఫ్ టైమ్ ఎక్స్‌పీరియెన్స్‌ అన్నారు. సినిమా కోసం ఇంత క‌ష్ట‌ప‌డుతున్న ఈ అమ్మ‌డికి సెకండ్ ఇన్నింగ్సులోనైనా హిట్లు ద‌క్కుతాయో చూడాలి మ‌రి.


Next Story
Share it